
శోభాయమానం.. ఆరాధనోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో 6వ రోజు బుధవారం ఉత్సవాలు రమణీయంగా సాగాయి. వేకువ జామున 5.30కు సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పూజలు, రాయరు పాదపూజ, మూలదేవర సంస్థాన పూజ, శ్రీరాఘవేంద్రస్వామి మఠం 13వ పీఠాధిపతి సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధనలు కనుల పండువగా సాగాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు.
అశ్వ వాహనంపై విశ్వ మోహనుడు
బుధవారం రాత్రి 10 గంటలకు ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు అశ్వ వాహనంపై కడు వైభవంగా ఊరే గారు. మంగళ వాయిద్యాలు, దాస సాహిత్య మండలి మహిళల భజనలు, అశేష భక్త జనం హర్ష ధ్వానాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో విహరించారు. అనంతరం చెక్క, వెండి, అంబారి, స్వర్ణ రథాలపై ఉత్సవమూర్తికి రథయాత్రలు నిర్వహించారు. ఈ వేడు కలో మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వా మి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్ కుమా ర్‌రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల బీమయ్య పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఆరాధన సప్తరాత్రోత్సవాలు సందర్భంగా యోగీంద్ర మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెంది న విదూషి సంగీత కులకర్ణి దాసవాణి, సుధా స్కూలు బృందం హరిదర్శన నృత్య రూపకం భక్తులను మంత్రముగ్దులు చేసింది.
నేడు సర్వ సమర్పణోత్సవం
ఉత్సవాల ఆఖరిరోజు అయిన గురువారం సర్వ సమర్పణోత్సవం జరుగనుంది. ఏక కాలంలో పంచ వాహనాలపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు, రాఘవేంద్రులను శ్రీమఠం మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఉద యం అనుమంత్రాలయం తుంగభద్ర గ్రామం మృత్తిక బృందావన క్షేత్రంలో ఆరాధన వేడుకలు, రథయాత్ర నిర్వహిస్తారు.
అశ్వ వాహనంపై ఊరేగిన
ప్రహ్లాదరాయులు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

శోభాయమానం.. ఆరాధనోత్సవం

శోభాయమానం.. ఆరాధనోత్సవం