
లైసెన్స్ ఫీజు 20వ తేదీలోగా చెల్లించాలి
కర్నూలు: జిల్లాలోని మద్యం దుకాణాల ఐదో విడత లైసెన్స్ ఫీజు ఈనెల 20లోపు చెల్లించేలా చూడాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో నంద్యాల, కర్నూలు జిల్లాల ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా నమోదైన నేరాలు, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, నాటుసారాను సమూలంగా నిర్మూలించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. కర్నూలు జిల్లాలో 40 శాతం గ్రామాలను నెలాఖరుకు సారా రహిత ప్రాంతాలుగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలు జిల్లాలో 430 మంది, నంద్యాల జిల్లాలో 352 మంది పాత నేరస్థులు ఉన్నారని, వారందరినీ నెలాఖరు లోపు తహసీల్దార్‌ల ఎదుట బైండోవర్ చేయాలన్నారు. ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడి జైలుకు వెళ్లినప్పటికీ వృత్తిని మానుకోని వారిపై ఒక్కో స్టేషన్ పరిధిలో ఒకరిపై నెలాఖరులోపు పీడీ కేసులు నమోదు చేయాలన్నారు. నవోదయం 2.0 అమలులో భాగంగా సారా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కానిస్టేబుల్‌కు బీట్ పరిధిని నిర్ణయించి సారా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణారెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడ్‌తో పాటు ఉమ్మడి జిల్లాల ఇన్‌స్పెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు.