కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 18,707 మంది ప్రభుత్వ పెన్షన్‌దారులు ఉన్నారని, ఇప్పటి వరకు 15,701 మంది జీవన్ ప్రమాణ్ ధ్రువీకరణ పత్రా లు సమర్పించినట్లు జిల్లా ఖజానా అధికారి బి.రామచంద్రరావు తెలిపారు. ఇంకా 3,006 మంది వీటిని ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. కదల్లేని పెన్షన్‌దారుల వివరాలు తెలియచేసినట్లయితే జిల్లా ఖజా నా సిబ్బంది నేరుగా ఇంటికే వెళ్లి జీవన్ ప్రమాణ్ ధ్రువీకరణ పత్రాన్ని ప్రభుత్వ యాప్ ద్వారా అప్‌లోడ్ చేస్తారన్నారు.పెన్షన్‌దారుల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. జీవన్ ప్రమాణ్ ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 28వ తేదీలోపు సమర్పించాలన్నారు. పెన్షనర్లు నేరుగా సబ్ ట్రెజరీ కా ర్యాలయాలకు వచ్చి బయోమెట్రిక్ వేసి సమర్పించవచ్చని, లేదంటే జీవన్ ప్రమాణ్ ప్రభుత్వ యాప్ ద్వారా సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.
జిల్లా ఖజానా అధికారి రామచంద్రరావు


