క్యాలెండర్‌లో మరో సంవత్సరం మారిపోయింది. చేదు, తీపి జ్ఞా
● జిల్లా వ్యాప్తంగా ‘నూతన’ వేడుకలు ● అధికారులకు, రాజకీయ నేతలకు శుభాకాంక్షలు
నంద్యాల: జిల్లా అభివృద్ధికి అధికారులందరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. నూతన సంవత్సరం 2026 సందర్భంగా గురువారం నంద్యాల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారిని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్‌షెరాన్‌కు ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరంలో జిల్లాలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను గుర్తు చేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు కృషి చేయడం అభినందనీయమన్నారు. నూతన సంవత్సరం 2026లో నంద్యాల జిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పరిపాలన, సమర్థవంతమైన సేవల అందింపు దిశగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలన్నారు.
క్యాలెండర్‌లో మరో సంవత్సరం మారిపోయింది. చేదు, తీపి జ్ఞా
క్యాలెండర్‌లో మరో సంవత్సరం మారిపోయింది. చేదు, తీపి జ్ఞా
క్యాలెండర్‌లో మరో సంవత్సరం మారిపోయింది. చేదు, తీపి జ్ఞా


