మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి

Published Mon, May 20 2024 8:45 AM

మిద్ద

ఆలూరు: మిద్దైపె నుంచి కాలు జారి పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆలూరు మండలం అరికెర గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అరికెర గ్రామానికి చెందిన గోవిందప్ప, భాగ్యమ్మ దంపతులకు కుమారుడు పాండు (29) అదే గ్రామానికి చెందిన తిరుమలమ్మను ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరద్దరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే శనివారం రాత్రి భార్య, భర్తలు మిద్దైపె పడుకోవడానికి వెళ్లారు. తెల్ల వారే సరికి మిద్దైపె నుంచి కింద పడి మృతి చెందినట్లు పాండు తండ్రి గోవిందప్ప ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాండు మృతిపై కేసు నమోదు చేసుకుని సమగ్రంగా విచారణ ఽ చేస్తున్నామని ఎస్‌ఐ ఓబులేసు విలేకరులకు తెలిపారు.

ఇస్వీలో ప్రబలిన అతిసారం

45 మందికి అస్వస్థత

ఆదోని టౌన్‌: మండలంలోని ఇస్వీ గ్రామంలోని అతిసార వ్యాధి ప్రబలింది. కలుషితనీరు తాగి 45 మంది అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతూ స్థానిక ఏరియా ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో మహబూబియా, మాబి, ఇమామ్‌బి, చాంద్‌బాషాతో పాటు 41 మంది ఉన్నారు. అతిసార వ్యాధి ప్రబలినా ఇప్పటివరకు అధికారులు ఎవరూ గ్రామం వైపు చూడలేదని గ్రామస్తులు వాపోతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి కొంతమందికి, శనివారం మరికొంతమందికి, ఆదివారం కూడా ఆస్పత్రిలో చేరుతున్నారని గ్రామస్తులు తెలిపారు.

మిద్దైపె నుంచి పడి  యువకుడి మృతి
1/1

మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement