డిసెంబర్ 10 వరకు అభ్యంతరాల స్వీకరణ
రన్నరప్ నల్లగొండ జట్టు
రాష్ట్రస్థాయి అండర్–17 బాలుర వాలీబాల్ పోటీల్లో నల్లగొండ జట్టుకు రెండో స్థానం దక్కింది.
ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
- 8లో
2,21,829
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ముసాయిదా ఓటరు జాబితా బుధవారం విడుదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు జిల్లాల్లో మొత్తం 2,21,829 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి మొత్తం 2,38,326 దరఖాస్తులు అందాయి. వీటిలో 2,21,829 దరఖాస్తులను అధికారులు ఆమోదించగా, వివిధ కారణాలతో 16,497 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ముసాయిదా జాబితా ప్రకారం.. 1,36,439 మంది పురుష ఓటర్లు, 85,389 మంది మహిళా ఓటర్లు, ఒకరు థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మూడు జిల్లాలను కలిపి చూస్తే పురుష ఓటర్ల సంఖ్య మహిళా ఓటర్ల కంటే 51,050 అధికంగా ఉంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో మొత్తం 293 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
నల్లగొండ జిల్లాలో అత్యధిక ఓటర్లు...
ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా నల్ల గొండ నిలిచింది. జిల్లాలో అత్యధికంగా 1,07,003 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 146 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 65,933 మంది పురుషులు, 41,070 మంది మహిళలు ఓటర్లుగా నమోదయ్యారు.
● సూర్యాపేట జిల్లాలో మొత్తం 95 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో 43,704 మంది పురుష ఓటర్లు, 25,108 మంది మహిళా ఓటర్లు, ఒక థర్డ్ జెండర్ ఓటరు కలిపి మొత్తం 68,813 మంది ఓటర్లు ఉన్నారు.
● యాదాద్రి భువనగిరి జిల్లాలో 52 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 26,802 మంది పురుషులు, 19,211 మంది మహిళలు ఓటర్లుగా నమోదయ్యారు. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 46,013గా ఉంది.
పురుష ఓటర్టే ఎక్కువ..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు జిల్లాల ఓటర్ల వివరాలను పరిశీలిస్తే పురుష ఓటర్లు 61.5 శాతంగా, మహిళా ఓటర్లు 38.5 శాతంగా ఉన్నారు. మూడు జిల్లాల్లోనూ పురుష ఓటర్ల సంఖ్య మహిళా ఓటర్ల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోనే అత్యధికంగా 24,863 మంది, సూర్యాపేటలో 18,596 కాగా, యాదాద్రి భువనగిరిలో 7,591 మంది పురుష ఓటర్లు మహిళా ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నారు.
సెప్టెంబర్ 28న ప్రారంభమైన
నమోదు ప్రక్రియ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను ఎన్నికల సంఘం ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ప్రారంభించింది. అర్హులైన పట్టభద్రుల నుంచి ఫారం–18 ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. మొదట్లో నవంబర్ 6వ తేదీని దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువుగా నిర్ణయించింది. అయితే నవంబర్ 6వ తేదీతోనే నమోదు ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయినట్లు భావించకూడదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అందులో భాగంగా ఆ తరువాత కూడా దరఖాస్తులను స్వీకరించారు. బుధవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. బుధవారం నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు కై ్లమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ సమయంలోనూ ఫారం–18 ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. తుది జాబితా ప్రచురణ అనంతరం కూడా నామినేషన్ల దాఖలుకు నిర్ణయించిన చివరి తేదీ వరకు ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఫ ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్ల కంటే పురుషులే 51,050 మంది అధికం
ఫ 293 పోలింగ్ స్టేషన్లు..
ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి పట్టభద్రుడు పరిశీలించుకోవాలి. అర్హత ఉన్నప్పటికీ పేరు లేకపోతే క్లెయిమ్ దాఖలు చేయాలి. పేర్లు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులు ఉంటే సంబంధిత సవరణ ప్రక్రియను అనుసరించాలి. ఇందుకోసం డిసెంబర్ 10వ తేదీలోగా అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని అధికారులు డిసెంబర్ 25వ తేదీలోగా పరిష్కరించి, డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.


