నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ముసాయిదా ఓటరు జాబితాను బుధవారం విడుదల చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అర్హత ఉండి జాబితాలో పేరు లేనివారి దరఖాస్తు చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు హకరించాలని కోరారు. పట్టభద్రుల ముసాయిదా జాబితా, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆయన కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. అర్హత కలిగి ఉండి ఏదైనా కారణం చేత ఓటరుగా నమోదు కాని పట్టభద్రులు ఈనెల 25 నుండి డిసెంబర్ 10 వరకు, తుది జాబితా ప్రకటించినప్పటి నుంచి నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటరు జాబితాలో ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు ఓటరు జాబితాను చదివి వినిపించడంతో పాటు, ఓటరు జాబితాపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పిస్తారని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పార్టీల నాయకులు బక్క పిచ్చయ్య, లింగస్వామి, రావులపాటి రవిశంకర్, నర్సిరెడ్డి, రవి, అబ్దుల్ మాలిక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణమూర్తి, డీటీ సందీప్, వంశీ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


