ఆదర్శంగా రూపుదిద్దుకుంటున్న తాజ్‌పూర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదర్శంగా రూపుదిద్దుకుంటున్న తాజ్‌పూర్‌

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

భువనగిరి: తాజ్‌పూర్‌ గ్రామం ఆదర్శంగా రూపుదిద్దుకుంటోందని పంచాయతీరాజ్‌ శాఖ అదనపు కమిషనర్‌ రవీందర్‌రావు పేర్కొన్నారు. బుధవారం భువనగిరి మండలంలోని తాజ్‌పూర్‌ గ్రామంలో జలసిరి పనులను తనిఖీ చేశారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్‌, కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌, డ్రెయిన్‌ చివర సోక్‌ ీపిట్స్‌, నిర్మాణంలో ఉన్న మహిళా భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జలసిరిలో భాగంగా గ్రామంలో 100 శాతం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అని అన్నారు. వర్షం నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా పనులు చేస్తున్న గ్రామ సర్పంచ్‌ను అభినందించాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలోనే తాజ్‌పూర్‌ను ఆదర్శంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జలసిరి లక్ష్యాలను గ్రామంలో పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ర్యాకల సంతోషశ్రీనివాస్‌, జిల్లాపంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, డివిజనల్‌ పంచాయతీ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి దినకర్‌, ఉప సర్పంచ్‌ ఓరుగంటి కృష్ణ, కార్యదర్శి నర్సింగ్‌రావు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రామస్వామి పాల్గొన్నారు.

ఫ పంచాయతీరాజ్‌ శాఖ అదనపు కమిషనర్‌ రవీందర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement