రామగిరి (నల్లగొండ) : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున శివయ్యను దర్శించుకుని దీపాలు వెలిగించేందుకు భక్తులు శివాల యాలకు భారీగా తరలిరానుండటంతో ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని చారిత్రక పానగల్లు ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర ఆలయాలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
నల్లగొండలోని వీటీ కాలనీ శివాలయంలో అలంకరించిన శివలింగం


