ప్రొబేషనరీ డీఎస్పీల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

ప్రొబేషనరీ డీఎస్పీల కేటాయింపు

Nov 24 2026 2:18 AM | Updated on Nov 24 2026 2:18 AM

నల్లగొండ : శిక్షణలో భాగంగా ఐదుగురు ప్రొబేషనరీ డీఎస్పీలను జిల్లాకు కేటాయించారు. వీరు 24 వారాల పాటు జిల్లాలో పోలీస్‌శాఖలో క్షేత్రస్థాయి విధులు, పోలీసింగ్‌ వ్యవస్థపై అనుభవం పొందనున్నారు. జిల్లాకు కేటాయించిన వారిలో ప్రొబెషనరీ డీఎస్పీలు సైలేశ్‌ పూనా, ఎర్రగారి ప్రభాత్‌రెడ్డి, నర్రా అఖిల్‌, లావుడ్యా శ్రీకాంత్‌, ఎం.శ్రీకాంత్‌ ఉన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం పోలీస్‌ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 48 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపారు. వినతులు స్వీకరించిన ఎస్పీ వాటిని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్‌ అధికారులుకు ఫోన్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్‌ గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రతిభను చాటేలా ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌

నల్లగొండ : యువతలో క్రీడాస్ఫూర్తిని నింపి జాతీయస్థాయిలో క్రీడాకారులు ప్రతిభను చాటే అవకాశం కల్పించేందుకు ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. డిసెంబర్‌ 11 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం పట్టణాల్లో జాతీయ యువజన క్రీడలు జరగనున్నాయని తెలిపారు. క్రీడాకారులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌ రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్‌ అలీ పాల్గొన్నారు.

20 ఏళ్ల తర్వాత ఉపాధి పనులు

పెద్దవూర : మండలంలోని తుంగతుర్తి పంచాయతీ పరిధిలోని రామన్నగూడెంలో 20 సంవత్సరాల నుంచి సాంకేతిక కారణాలతో ఉపాధి హామీ పనులు నిర్వహించలేదు. ఈ సమస్యను సర్పంచ్‌ ముత్యాలుయాదవ్‌.. ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి విన్నవించారు. ఆయన అధికా రులతో మాట్లాడి గ్రామంలో వీబీజీరాంజీ పనులు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో సోమవారం గ్రామంలో ఉపాధి పనులు ప్రారంభించారు. కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉపాధి పనులు కల్పించడం ఆనందంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నక్కల నాగమ్మమట్టారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

25 నుంచి అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలన

నల్లగొండ : అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు తిరిగి చెల్లింపు ప్రక్రియలో భాగంగా ఈ నెల 25 నుంచి బాండ్ల పరిశీలన చేపట్టనున్నట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్ల పరిశీలన నిర్వహిస్తామని పేర్కొన్నారు. మండలాల వారీగా కేటాయించిన తేదీల్లో రోజుకు 250 మంది బాధితుల బాండ్లను పరిశీలిస్తామని తెలిపారు. బాధితులు వారికి కేటాయించిన తేదీల్లోనే రావాలని పేర్కొన్నారు. డిపాజిటర్‌ మరణిస్తే.. నామినీ, వారసులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో రావాలని సూచించారు. వివరాలకు 08682–222423, 8712670421 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement