మిర్యాలగూడ మండలం బకల్‌వాడి, బంగారుగడ్డ, ప్రభుత్వ పాఠశాల మిర్యాలగూడ, ఆలగడప, గాంధీపార్క్, ఈదులగూడెం, నల్లగొండ మండలం దోమలపల్లి, గొల్లగూడెం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల(జి), పద్మావతినగర్, పానగల్లు, ప్రభుత్వ హైస్కూల్ నల్లగొండ, కొండమల్లేపల్లి, డిండి, అడవిదేవులపల్లి, దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, మర్రిగూడ, నార్కట్‌పల్లి మండలం నార్కట్‌పల్లి, అమ్మనబోలు, నకిరేకల్, చింతపల్లి మండలం చింతపల్లి, కుర్మేడ్, నాంపల్లి, చండూరు మండలం చండూర్, బోడంగిపర్తి, చిట్యాల మండలం వెలిమినేడు, మునుగోడు మండలం మునుగోడు, కొంపెల్లి పాఠశాలలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు.
మిర్యాలగూడ టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పఠనంపై ఆసక్తి, విజ్ఞానాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలను చేపట్టింది. నల్లగొండ జిల్లాలో 29 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. లైబ్రరీలు ఏర్పాటు చేసేందుకు ఒక్కో పాఠశాలకు రూ.15 వేల చొప్పున నిధులు విడుదల చేసింది. ఈ నిధుల ద్వారా లైబ్రరీలలో అవసరమైన బెంచీలు, కూర్చీలు, పుస్తకాలతో పాటు న్యూస్ పేపర్లు, మ్యాగజైన్ తదితర వసతులను కల్పించనున్నారు. లైబ్రరీల నిర్వహణకు ప్రభుత్వం ప్రతి నెల రూ.వెయ్యి చొప్పున ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నిధులు కమిటీ నిర్ణయం మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఫ 29 సూళ్లలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు
ఫ ఒక్కో పాఠశాలకు రూ.15వేలు మంజూరు


