నల్లగొండ : సారూ.. సమస్యలు పరిష్కరించండి అంటూ పలువురు బాధితులు కలెక్టర్‌కు విన్నవించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. బాధితుల నుంచి కలెక్టర్ చంద్రశేఖర్, ట్రెయినీ కలెక్టర్ శ్రీకాంత్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్‌చార్జి అదపపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్ దరఖాస్తులకు సివిల్ సప్లయ్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఫ ప్రజావాణిలో కలెక్టర్‌కు సమస్యలు విన్నవించిన బాధితులు


