నల్లగొండ : డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో డీటీఎఫ్‌కు సభ్యత్వం లభించిన నేపథ్యంలో పదవీ విరమణ చేసిన బాధ్యుల స్థానంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్‌జీఓ భవన్‌లో సోమవారం నిర్వహించిన మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. వెంకటేశం ఎన్నికపై డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ఏడుకొండలు, జిల్లా ఉపాధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, పుష్ప, గోపి, జిల్లా కార్యదర్శులు ఎం.నాగయ్య, ఈ.జగతి, వీరస్వామి, విజయ్‌కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎం.సోమయ్య, వెంకులు, నాగేంద్రమ్మ, ఖుర్షీద్‌మియా హర్షం వ్యక్తం చేశారు.


