నాకఫ్‌ కాంట్రాక్ట్‌ సంస్థను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నాకఫ్‌ కాంట్రాక్ట్‌ సంస్థను రద్దు చేయాలి

Nov 24 2026 2:18 AM | Updated on Nov 24 2026 2:18 AM

మిర్యాలగూడ : సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు నాసిరకమైన సరుకులు అందిస్తున్న నాకఫ్‌ కాంట్రాక్ట్‌ సంస్థను తక్షణమే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శంకర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట అన్నం ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు అందించే సరుకుల పంపిణీని సెంట్రలైజేషన్‌ పేరుతో నాకఫ్‌ కాంట్రాక్ట్‌ సంస్థకు అప్పగించి పేద, మధ్య తరగతి విద్యార్థుల కడుపు కొట్టిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించలేని మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలన్నారు. సెంట్రలైజేషన్‌ను, ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జగన్‌నాయక్‌, సైదా, వీరన్న, సూర్య, పుట్ట సంపత్‌, సమీర్‌, పవన్‌, కల్యాణ్‌, గంగోత్రి, గీత, సుహాసిని, రాధిక, స్పందన, లోహి, ఝాన్సీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement