ఈఎస్‌ఐ ఆస్పత్రిని వెంటనే తెరవాలి | - | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ ఆస్పత్రిని వెంటనే తెరవాలి

Nov 24 2026 2:18 AM | Updated on Nov 24 2026 2:18 AM

మిర్యాలగూడ : కార్మికులకు వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్‌ఐ ఆసుపత్రి మూతపడడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని, ఈనెల 30లోపు ఆసుపత్రిని తిరిగి ప్రారంభించకపోతే తాను నిరవధిక నిరాహార దీక్ష చేపడ్తానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈఎస్‌ఐ ఆస్పత్రి భవనానికి 12నెలల అద్దె, రెండు నెలల విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడంతో భవన యజమాని తాళం వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి మూతపడడంతో కార్మికులకు వైద్య సేవలు అందడం లేదన్నారు. ఆస్పత్రికి అనువైన భవనాన్ని వెంటనే కేటాయించి ఈ నె 30 లోపు వైద్య సేవలు ప్రారంభించాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రామచంద్రు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ లేకుంటే 30 నుంచి నిరవధిక నిరాహార దీక్ష

ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement