రామగిరి (నల్లగొండ) : విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ, నిత్యం గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, తద్వారా ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తాను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో అక్కడి లైబ్రరీని సద్వినియోగం చేసుకోవడం వల్లే నేడు ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ మాట్లాడుతూ స్కూల్ పిల్లలు వారానికి ఒకసారైనా గ్రంథాలయానికి వచ్చి చందమామ వంటి కథల పుస్తకాలు చదవాలని సూచించారు. కార్యక్రమంలో కాసుల రవికుమార్, రాపోలు జయకర్, ఎంఎస్.శ్రవణ్‌కుమార్, ఆర్.కుసుమశ్రీ, ఎం.రాజేష్, బి.శ్రీనివాస్ ఉన్నారు.


