పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం పోలీస్‌ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 28 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు వినతులు ఆయనకు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్‌ అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఫోన్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. పోలీస్‌ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్‌ గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నల్లగొండను ప్రథమ స్థానంలో నిలవాలి

నల్లగొండ టూటౌన్‌ : హ్యాండ్‌ బాల్‌ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో నల్లగొండ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఏఎస్పీ రమేష్‌ అన్నారు. సోమవారం నల్లగొండలోని మేకల అభినవ్‌ ఔట్‌డోర్‌ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సీనియర్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ జట్టు సెలక్షన్‌ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో బాలికలు సత్తా చాటి నల్లగొండకు పేరు తేవాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ.ఉస్మాన్‌, సీఐ ఆదిరెడ్డి, ఏఆర్‌ ఆర్‌ఐ శ్రీనివాస్‌, ఆర్‌ఎస్‌ఐ నరసింహ, ప్రిన్సిపాల్‌ నర్సింగ్‌రావు, అసోసియేషన్‌ కార్యదర్శి పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.

కూలీలకు వసతులు

కల్పించాలి

నల్లగొండ : ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాల్లో పనిచేసే కూలీలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇటుక బట్టీలు, కోళ్లపారాల్లో కూలీల సంక్షేమంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా కూలీలకు అన్ని రకాల పనులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నివాసానికి ఆమోదయోగ్యమైన పని ప్రదేశాలు ఉండాలని, వివరాలన్నింటిని నిర్దేశించిన ప్రొఫార్మర్లో పంపించాలని సూచించారు. విద్య, వైద్యం, ఇతర వసతులు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రమేష్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఉప కార్మిక సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల

జాబితా పంపుతాం

నల్లగొండ : వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టవద్రుల నియోజకవర్గానికి సంబంధించి తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నట్లు ఈఆర్‌ఓ, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ తెలిపారు. పట్టబద్రుల నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాపై సోమవారం కలెక్టరేట్‌ ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. గత ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో 605 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 894 కేంద్రాలకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందాయని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమ్మతితో ప్రతిపాదనలు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement