ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా | - | Sakshi
Sakshi News home page

ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

నల్లగొండ : కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకాల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనుంది. ఈ నెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుండగా, డిసెంబర్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పథకంపై సోమవారం కలెక్టరేట్‌ నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని సుమారు 4.86 లక్షల కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలని, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్‌కార్డు లేని కుటుంబాలకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు కలెక్టర్‌ తెలిపారు. కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల జీవిత బీమా అందుతుందన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి బీమా పొందే వ్యక్తిగా, కుటుంబ సభ్యులు నామినీలుగా ఉంటారని, ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను కూడా నమోదు చేసుకోవచ్చని, నామినీ మైనర్‌ అయితే బీమా పొందే వ్యక్తి సమ్మతితో మరో వ్యక్తిని నామినీగా పేర్కొనవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు, ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు.

గ్రామాలు, వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ

గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి కేంద్రానికి ఒక ఇన్‌చార్జిని నియమించి, ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. రేషన్‌కార్డు ఆధారంగా దరఖాస్తులో ముందుగానే వివరాలు నమోదై ఉంటాయని, వాటిని జాగ్రత్తగా పరిశీలించి కుటుంబ పోషకుడు, నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌ పోర్టల్‌ ద్వారా పత్రాలను అప్‌లోడ్‌ చేయాలని, హార్డ్‌కాపీలను ఎంపీడీవో కార్యాలయాల్లో భద్రపరచాలని ఆదేశించారు. మూడు, నాలుగు క్లస్టర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించి గ్రామాల వారీగా పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ఎంపీడీవోలు, ఎంఈవోలు, తహసీల్దార్లు, ఏఈపీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎంపీవోలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఈ పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఒకేసారి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ఫ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ

జీవిత బీమా పథకం ప్రారంభం

ఫ డిసెంబర్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

ఫ నల్లగొండ జిల్లాలో 4.86 లక్షల కుటుంబాలకు అవకాశం

ఫ పథకం అమలుపై అధికారులకు

కలెక్టర్‌ దిశానిర్దేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement