సాధారణ ప్రజావాణికి
158 దరఖాస్తులు
నల్లగొండ : బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం కలెక్టర్ నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణికి విశేష స్పందన లభించింది. తొలిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై 45 దరఖాస్తులు అందాయి. వీటిలో గురుకుల అడ్మిషన్ల కోసం అత్యధికంగా 11 మంది వినతులు సమర్పించారు. ఆర్థిక సాయం కోసం ఆరు, పింఛన్ల కోసం నాలుగు, వైద్య చికిత్స కోసం రెండు, వీల్‌చైర్లు, వినికిడి పరికరాల కోసం మరో రెండు దరఖాస్తులు వచ్చాయి. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన పిల్లల ప్రత్యేక ప్రజావాణికి కలెక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు గోగుల సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తోందన్నారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు తమ సమస్యలను నేరుగా అధికారుల దష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని సూచించారు.
వైద్య సాయానికి తక్షణ స్పందన..
ప్రజావాణిలో ఓ బాలిక కాలి శస్త్రచికిత్స కోసం సహాయం కోరగా కలెక్టర్ వెంటనే స్పందించారు. డీఎంహెచ్‌ఓతో మాట్లాడి వైద్య సహాయం అందించేలా చర్యలు చేపట్టారు. మనవరాలి వైద్య చికిత్స కోసం వచ్చిన ఓ వృద్ధుడి వినతిపైనా సంబంధిత వైద్యాధికారులతో మాట్లాడారు.
పిల్లలు, తల్లిదండ్రుల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్
ప్రజావాణికి హాజరైన పిల్లలు, తల్లిదండ్రులు
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 63, ఇతర శాఖలకు 95.. మొత్తం 158 దరఖాస్తులు అందాయి. పిల్లల ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన 45 ఫిర్యాదులతో కలిపి మొత్తం 203 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి లావణ్యకుమారి, టీసీపీఓ గణేష్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్వో దశరథ్ పాల్గొన్నారు.


