బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి : రావుల వెంకయ్య | - | Sakshi
Sakshi News home page

బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి : రావుల వెంకయ్య

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి : రావుల వెంకయ్య

ఏఐకేఎస్‌ (సీపీఐ అనుబంధం) జాతీయ కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ అమెరికా సామ్రాజ్యవాద ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వం తలొంచిందని అఖిల భారత కిసాన్‌ సభ (సీపీఐ అనుబందం) రావుల వెంకయ్య విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రైతులు ఐక్య పోరాటాలతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఏఐకేకేఎంఎస్‌ సీనియర్‌ నేత శంకర్‌ ఘోష్‌, ఏఐకేఎస్‌కే ప్రధాన కార్యదర్శి పురుషోత్తం శర్మ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే వారిపై నేరుగా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందుల గురించి ఆలోచించకుండా బీజేపీ మతం పేరిట ప్రజల్ని చీల్చిందని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా నైజాంను తరిమినట్టే ఐక్య పోరాటాల ద్వారా కేంద్రంలోని మోదీ సర్కారును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement