తోమాల, తులాభార సేవల పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

తోమాల, తులాభార సేవల పునరుద్ధరణ

Nov 13 2026 4:17 AM | Updated on Nov 13 2026 4:17 AM

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో తోమాల, తులాభార సేవలను ఆలయ అధికారులు గురువారం పునరుద్దరించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో ప్రారంభించిన ఈ సేవలు కొన్ని రోజులకే నిలిచిపోయాయి. భక్తుల కోరిక మేరకు ఈ సేవలు మళ్లీ పునఃప్రారంభించినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్‌ పేర్కొన్నారు. తోమాల సేవలో దంపతులు పాల్గొనే అవకాశాన్ని దేవస్దానం కల్పించింది. దీని టికెట్‌ ధర రూ.1250గా నిర్ణయించారు. భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో ఈ సేవలో పాల్గొనాలి. ఉదయం నిత్య సహస్రనామార్చన అనంతరం సుమారు అరగంట పాటు ఈ సేవను ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. సేవ పూర్తి చేసుకున్న అనంతరం స్వామివారి గర్భాలయ ప్రవేశ దర్శనం భక్తులకు కల్పించబడుతుంది. దీంతో పాటు స్వామివారి శెల్లా కనుము, అభిషేకం లడ్డూ ప్రసాదాన్ని సేవలో పాల్గొన్న భక్తులకు అందజేస్తారు. అదేవిధంగా తులాభార సేవలను కూడా ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు తులాభారంలో సరితూగేంత నగదు, సరుకులను అందించి మొక్కు చెల్లించుకోవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement