హాలియా(గుర్రంపోడు) : పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న యువకుడు గత నెల 30వ తేదీన క్రిమిసంహాకర మందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. గుర్రంపోడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన నల్ల కోటేష్(26) నాంపల్లిలో ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఆన్లైన్ గేమ్‌లకు బానిసైన కోటేష్ బంక్‌కు సంబంధించిన డబ్బులు వాడుకున్న విషయం యాజమానికి తెలిసింది. రూ.3లక్షల వరకు లెక్కల్లో తేడా రావడంతో బంక్ యాజమాన్యం కోటేష్‌ను గట్టిగా నిలదీయడంతో.. గత నెల 30వ తేదీన క్రిమిసంహారక మందు తాగి, నాంపల్లి రోడ్డులోని ఏఎమ్మార్పీ కాల్వ సమీపంలో పడిపోయాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కోటేష్‌ను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి ఆన్లైన్లో కేసును నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు గుర్రంపోడు పోలీసులు తెలిపారు.
మృతదేహంతో ధర్నా..
నాంపల్లి : కోటేష్ మృతికి బంక్ యాజమాన్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ మృతదేహంతో గురువారం బంక్ వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసులు సర్దిచెప్పడంతో ధర్నా విరమించారు.


