రామగిరి (నల్లగొండ), చిట్యాల: చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన పిల్లలమర్రి రాములు 2025 సంవత్సరానికి గాను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించిన కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. త్వరలో ఈ పురస్కారం అందజేయనున్నట్లు విశ్వవిద్యాలయం అధికారులు పేర్కొన్నారు. రాములు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో తెలుగు విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. ఆయన తెలుగులో భక్తి కవిత్యం–సామాజిక విశ్లేషణ, పాల్కురికి సోమనాథ లఘుకృతులు, పాల్కురికి సోమనాథ సోత్త్ర సాహిత్యంకు సంపాదకత్వం వహించారు. 40మంది ఎంఫిల్ విద్యార్థులకు, 20మంది పీహెచ్‌డీ విద్యార్థులకు ఆయన మార్గదర్శకుడిగా ఉన్నారు. రాములు ఎంపికవ్వడం పట్ల తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, సాహితీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.


