ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం

Nov 13 2026 4:17 AM | Updated on Nov 13 2026 4:17 AM

మిర్యాలగూడ(వేములపల్లి) : బైక్‌పై వెళ్తున్న యువకుడు ట్రాక్టర్‌ను ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన వేములపల్లి గ్రామ శివారులోని శెట్టిపాలెం క్రాస్‌రోడ్డు వద్ద గురువారం జరిగింది. ఎస్‌ఐ సురేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన బుర్రి లోకేష్‌(23) గురువారం బైక్‌పై మిర్యాలగూడలోని శాంతినగర్‌లో ఉంటున్న తన భార్య మానస వద్దకు వెళ్తున్నాడు. అదే సమయంలో పాములపాడు గ్రామానికి చెందిన సబ్బు మహేందర్‌రెడ్డి ఽశెట్టిపాలెం శివారులోని మిల్లుల వద్ద ధాన్యం విక్రయించి శెట్టిపాలెం క్రాస్‌రోడ్డు వద్ద ఎలాంటి సిగ్నల్‌ ఇవ్వకుండా ట్రాక్టర్‌ను ఒక్కసారిగా క్రాసింగ్‌ తీసుకుంటుండంతో బైక్‌పై వెళ్తున్న లోకేష్‌ ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో లోకేష్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లోకేష్‌ను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

గేదెలను ఢీకొని మృతి

త్రిపురారం : బైక్‌పై వెళ్తు న్న యువకుడు గేదెలను ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన త్రిపురారంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ గైకూరి నరేష్‌ తెలి పిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండల కేంద్రానికి చెందిన పర్వతం మహేష్‌(24) పని నిమిత్తం బైక్‌పై మిర్యాలగూడకు వెళ్తున్నాడు. త్రిపురారం పరిధిలోని వెంకటసాయి రైస్‌మిల్లు వద్దకు చేరుకోగానే రోడ్డుపై ఎదురుగా వస్తున్న గేదెలు ఒక్కసారిగా బెదిరి మహేష్‌ బైక్‌ వైపు పరిగెత్తాయి. దీంతో బైక్‌ అదుపుతప్పి గేదెలను ఢీకొనడంతో మహేష్‌ రోడ్డుపై పడిపోయాడు. గాయపడిన మహేష్‌ను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి అన్న శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య ఉంది.

గుర్తుతెలియని వ్యక్తి

మృతదేహం లభ్యం

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట పట్టణంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11.30 గంటల సమయంలో 35 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సూర్యాపేట టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌) మార్చురీకి తరలించారు. మృతుడి పేరు సమీర్‌గా భావిస్తున్నామని, వివరాలు తెలిసిన వారు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో లేదా 87126 80134, 87126 86005, 87125 77224 నంబర్లను సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

బంగారు, వెండి

వస్తువులు అపహరణ

సిద్దిపేటకమాన్‌: ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి వస్తువులు అపహరించిన ఘటన సిద్దిపేట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పన్నాలగూడెంకు చెందిన కర్నాటి నరేశ్‌.. భార్యాపిల్లలతో కలిసి సిద్దిపేటలోని టీచర్స్‌కాలనీలో అద్దెకు ఉంటున్నారు. నరేశ్‌ పౌల్ట్రీఫామ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆరోగ్యం బాగోలేకఈ నెల 8న ఇంటికి తాళం వేసి భార్యాపిల్లలతో కలిసి ఊరెళ్లారు. ఇంటి తలుపులు దగ్గరకి వేసి ఉండడాన్ని గుర్తించిన ఇంటి యజమాని.. నరేష్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఊరు నుంచి ఎప్పుడు వచ్చారని ఆరా తీయగా ఇంకా రాలేదని చెప్పారు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 22తులాల వెండి వస్తువులు, రెండున్నర గ్రాముల బంగారం వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో బాధితుడు నరేష్‌ సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement