‘నిఫ్ట్‌’ను సందర్శించిన పోచంపల్లి చేనేత మహిళలు | - | Sakshi
Sakshi News home page

‘నిఫ్ట్‌’ను సందర్శించిన పోచంపల్లి చేనేత మహిళలు

Nov 13 2026 4:17 AM | Updated on Nov 13 2026 4:17 AM

భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లిలో యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో, ఫెర్నాడ్‌ రికార్డ్‌ ఇండియా ఫౌండేషన్‌ సహకారంతో రెండు నెలల ఇక్కత్‌ డిజైనింగ్‌, టై అండ్‌ డైలో శిక్షణ పూర్తిచేసుకున్న పోచంపల్లికి చెందిన చేనేత మహిళలు గురువారం పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌)ని సందర్శించారు. ప్రస్తుత ఫ్యాషన్‌ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతికతను అడిగి తెలుసుకున్నారు. సింథటిక్‌, సహజ రంగుల మధ్య గల తేడాలు, బ్లాక్‌ ప్రింటింగ్‌, నేత విధానాలు, నూతన డిజైన్‌ల కొరకు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను తెలుసుకున్నారు. చింతకింది మల్లేశం మాట్లాడుతూ.. సాంప్రదాయ చేనేత కళకు, ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిఫ్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గజం రాజేశ్‌, యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సతీష్‌, అసోషియేట్స్‌ మైఖేల్‌, సుదర్శన్‌, దిలీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement