సిండికేట్‌గా మారి.. ధర తగ్గించి | - | Sakshi
Sakshi News home page

సిండికేట్‌గా మారి.. ధర తగ్గించి

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

మిర్యాలగూడ : ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ప్రతి సీజన్‌లోనూ నష్టపోతున్నారు. మిల్లర్లు ధర తగ్గించడంతో ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో అన్నదాతలు ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు. ఆదివారం దీపావళి పండుగ రోజుకు కూడా మిర్యాలగూడలో కొందరు మిల్లర్లు తమ మిల్లులను తెరిచి ఉంచడంతో రైతులు అమ్ముకునేందుకు ధాన్యం తీసుకొచ్చారు. ఇదే అదునుగా భావించిన మిల్లర్లు క్వింటాకు కేవలం రూ.2,900 నుంచి రూ.3,200కు మాత్రమే కొనుగోలు చేశారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే మేము ఇంతే ధర ఇస్తాం.. లేకుంటే వేరే మిల్లుల్లో అమ్ముకోండి అంటూ బెదిరిస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమకు గరిష్ట ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు యాద్గార్‌పల్లి వద్ద మిర్యాలగూడ–కోదాడ రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ 25 రోజులుగా క్వింటా సన్న ధాన్యాన్ని రూ.4వేల నుంచి రూ.4,200 వరకు కొనుగోలు చేసిన మిల్లర్లు ఇప్పుడు సిండికేట్‌గా మారి ఒక్కసారిగా రూ.వెయ్యి ధర తగ్గించి రూ.2,900 నుంచి రూ.3,200 వరకు మాత్రమే చెల్లిస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు వచ్చి మిల్లర్లతో మాట్లాడారు. ఎట్టకేలకు మిల్లర్లు గ్రేడ్‌–1 ధాన్యానికి క్వింటాకు రూ.3,700, గ్రేడ్‌–2కు రూ.3,600 చెల్లిస్తామని ఒప్పుకోవడంతో రైతులు ధర్నా విరమించారు.

అధికారుల పర్యవేక్షణ లేక..

మిర్యాలగూడలోని రైస్‌ మిల్లులకు జిల్లా నుంచే కాకుండా సూర్యాపేట, వరంగల్‌తోపాటు ఆంధ్రా ప్రాంతం నుంచి కూడా రైతులు సన్న రకాల ధాన్యం తెచ్చి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మిల్లుల వద్ద పడిగాపులు కాయించి తీరా పచ్చగింజ, తాలు పేరుతో మిల్లర్లు ధర తగ్గించడంతోపాటు భారీగా కోతలు పెడుతున్నారు. మిల్లర్లు సిండికేట్‌ అయ్యి ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నా కొనుగోళ్లపై సంబంధిత అధికారుల పర్యవేక్షణే లేదు. ఇప్పటికై నా మిల్లర్ల దోపిడీని అరికట్టి తమకు న్యాయం చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను రైతులు వేడుకుంటున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల మాయాజాలం

ఫ క్వింటాపై రూ.వెయ్యి తగ్గింపు

ఫ 25 రోజుల క్రితం

రూ.4వేల నుంచి రూ.4,200

ఫ ప్రస్తుతం రూ.3వేలకు కొనుగోలు

ఫ తరచూ రోడ్డెక్కుతున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement