ఒకే ఇంటికి రెండు నల్లా కనెక్షన్లు | - | Sakshi
Sakshi News home page

ఒకే ఇంటికి రెండు నల్లా కనెక్షన్లు

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

రెండు కనెక్షన్లు ఉంటే తొలగిస్తాం

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి నగరంలో ఒకే ఇంటికి రెండు నల్లాల కనెక్షన్‌ పెట్టుకున్న కొందరు దర్జాగా కృష్ణాజలాలను వినియోగించుకుంటూ మున్సి పల్‌ కార్పొరేషన్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో జలాశయాల్లో గణనీయంగా నీటి నిల్వలు పడిపోయిన తర్వాత కూడా తాగునీటి వృథాను అరికట్టడంలో జాప్యం జరుగుతోంది. అమృత్‌ పథకంలో భాగంగా నగరంలోని పలు కాలనీల్లో 1,300పైగా తాగునీటి పైప్‌లైన్‌ కనెక్షన్లు ఇచ్చారు. వీటిలో దాదాపు 500 వరకు నల్లా కనెక్షన్‌ ఉన్న నివాసాలకు సైతం డబుల్‌ కనెక్షన్‌ ఇచ్చారు. అప్పటి నిబంధనల ప్రకారం పాత పైప్‌లైన్‌ సరఫరా కట్‌ చేసి కొత్త పైప్‌లైన్‌ ద్వారా తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో నల్లా కనెక్షన్‌ ఇచ్చారు. కానీ చాలా కాలనీల్లో నేటికి కూడా పాత పైప్‌లైన్‌ కనెక్షన్‌ కట్‌ చేయకుండా కొత్త దానితోపాటు పాత పైప్‌లైన్‌ ద్వారా సైతం కృష్ణాజలాలు సరఫరా చేస్తున్నారు. దాంతో ఒకే ఇంటికి రెండు నల్లాల కనెక్షన్‌ల ద్వారా తాగునీరు సరఫరా జరుగుతున్న దాని నివారణ చర్యలు చేపట్టడంతో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పుష్కలంగా నీరున్నప్పుడు ఎలా సరఫరా జరిగినా.. నేడు వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే నగరంలో కొంత తాగునీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బిల్లు లేకుండానే వినియోగం

నీలగిరి నగరంలోని డీవీకే రోడ్‌లో పలు కాలనీలు, ముషంపల్లి రోడ్‌లో కొన్ని కాలనీలు, చర్లపల్లి, పానగల్‌, జైల్‌ ఖానా సమీపంలో తదితర ప్రాంతాల్లో కొందరు బిల్లులు చెల్లించకుండానే నల్లా కనెక్షన్‌లు ఇచ్చుకొని తాగునీరు పట్టుకుంటున్నారు. ఇలాంటివి దాదాపు 500 వరకు రెండు నల్లా కనెక్షన్‌లు ఉన్నట్లు తెలిసింది. నెలకు నల్లా బిల్లు రూ.100 కాగా 500 కనెక్షన్లకు నెలకు రూ.50,000 చొప్పున ఏడాదికి 6 లక్షల వరకు బిల్లుల రూపంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఖజానాకు గండి పడుతోంది. ఇలా గత ఆరేడుళ్లుగా నడుస్తున్నా ఇంజనీరింగ్‌ విభాగం ఉద్యోగులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు అక్రమ నల్లా కనెక్షన్లపై దృష్టి సారిస్తే తాగునీటి వృథాను అరికట్టవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అనుమతి ఒక దానికి.. వినియోగం రెండు

ఫ నల్లగొండలో భారీగా డబుల్‌ కనెక్షన్లు

ఫ వృథా అవుతున్న తాగునీరు

కాలనీల్లో వేసిన పాత పైప్‌లైన్‌ కట్‌చేసి కొత్త పైప్‌లైన్‌ ద్వారానే తాగునీటిని అందిస్తున్నాం. ఎక్కడైనా ఒకే ఇంటికి రెండు నల్లాల కనెక్షన్‌ ఉన్నట్లు తేలితే వెంటనే తొలగించి నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటాం.

– దిలీప్‌ భార్గవ్‌, కార్పొరేషన్‌ ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement