నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని సోమవారం రాత్రి అర్చకులు లక్ష పుష్పార్చన, ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతల నుంచి భక్తులు సాయంత్రం నుంచే తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. భక్తులు గట్టుపైన రాత్రి నిద్ర చేశారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను గట్టుపైకి పోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వరాల రమేష్, ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, డైరెక్టర్లు ప్రజ్ఞాపురం సత్యనారాయణ, కమ్మంపల్లి మల్లేశం, రేగట్టె శ్రీనివాస్‌రెడ్డి, లింగస్వామి, ఇరుకుల సంపత్, గద్దగోటి యాదగిరి, లక్ష్మయ్య, అర్చకులు పాల్గొన్నారు.


