ఫ నరకాసురుని వేషధారణలో రాచకొండ ప్రభాకర్ ప్రచారం
నల్లగొండ : గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్ఎస్కు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం నరకాసురుని వేషధారణలో నల్లగొండలోని వివిధ ప్రాంతాల్లో వినూత్న ప్రచారరం నిర్వహించారు. గంజాయ్, డ్రగ్స్ అనే కొత్త రాక్షసులు మీ శరీరాన్ని, జీవితాలను పిప్పి చేస్తున్నారని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సే నో డ్రగ్స్ విజ్ఞప్తి చేశారు. అలాగే రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలని, వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. నేను పురాణాల్లో పేర్కొన్న విధంగా నరకాసురున్ని కాదని.. డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమికొట్టడానికి వచ్చిన సామాజిక నరకాసురున్ని అని ఉపాధ్యాయుడు ప్రభాకర్ పేర్కొన్నారు.


