ట్రంప్‌ నిర్ణయాలతోనే ఎదురుదెబ్బ | - | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ నిర్ణయాలతోనే ఎదురుదెబ్బ

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

పరిపాలనలో అడ్డంకులు తప్పవు ఆంక్షలు తొలిగే అవకాశం ఉంది ట్రంప్‌ ఆధిపత్యానికి కళ్లెం ఉద్యోగాలు పోతాయనే అపోహతోనే.. వలసవాదులకు ఊరట

నేరేడుచర్ల : ఇటీవల అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ విజయం సాధించింది. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాల వలనే అధికార రిపబ్లిక్‌ పార్టీకి ఓటమి తప్పలేదని ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ఎన్‌ఆర్‌ఐలు చెబుతున్నారు. ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలపై వారు తమ అభిప్రాయాన్ని సాక్షితో

పంచుకున్నారు.

ఇటీవల అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాల వలన అధ్యక్షుడు ట్రంప్‌కు పరిపాలనా పరమైన నిర్ణయాలలో అడ్డంకులు తప్పకపోవచ్చు. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఎక్కువ సంఖ్యలో గెలవడం వలన అధికార పార్టీ తీసుకొచ్చే బిల్లులను అడ్డగించే అవకాశం ఉంది. అధ్యక్షుడు ట్రంప్‌ తన నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకునే అవకాశం లేదు.

– దొంతిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, కాలిఫోర్నియా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పలు వివాదస్పద నిర్ణయాల వలన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు అత్యధికంగా గెలిచారు. ఈ ఎన్నికల ఫలి తాలు భారతీయులపై వెంటనే ప్రభావం చూపకపోయినా కొద్దిరోజుల తర్వాత ట్రంప్‌ విధించిన ఆంక్షలు తొలిగిపోయే అవకాశం ఉంది.

– వంకాయల సరిత, కాలిఫోర్నియా

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రటిక్‌ పార్టీ విజయంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆధిపత్యానికి కళ్లెం వేసినట్లే. ట్రంప్‌ తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు అడ్డు తగిలే అవకాశం ఉంది. డెమెక్రాట్లు ప్రవేశ పెట్టే బిల్లులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విటో పవర్‌తో అడ్డుకునే అవకాశం ఉంది.

– పోతుగంటి నీలిమా, ఫ్లోరిడా

వలసవాదుల్లో ఉద్యోగాలు పోతున్నాయనే అపోహాతోనే డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపారు. ట్రంప్‌ వలసవాదులపై ఉక్కుపాదం మోపే క్రమంలో వీసాలపై ఆంక్షలు విధించడం, జన్మతః పౌరసత్వం ఉన్న వలసవాదులకు గ్రీన్‌కార్డులు రద్దు చేస్తామనడం, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా జోక్యం చేసుకోవడంతో ప్రజలు ఓటు ద్వారా తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు.

– వంకాయల సాయికృష్ణ, కాలిపోర్నియా

డెమోక్రాట్లు అత్యధిక స్థానాలు గెలవడం వలన వలసవాదులకు కొంత ఊరట లభిస్తుంది. వలసవాదులపై ట్రంప్‌ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అనవసరపు ఆర్థిక నిర్ణయాలపై డెమోక్రాట్ల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది.

– షర్మిల చల్లా, టెక్సాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement