అప్పు తీసుకున్న వ్యక్తి ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

అప్పు తీసుకున్న వ్యక్తి ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

చండూరు: తాను అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ.. తీసుకున్న వ్యక్తి ఇంట్లోనే బాధితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చండూరు మండలం ఇడికూడలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇడికూడ గ్రామానికి చెందిన బోయపల్లి స్వామి, అదే గ్రామానికి చెందిన మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమారుడు పాల్వాయి శ్రవణ్‌కుమార్‌రెడ్డికి దాదాపు రూ. 2 కోట్లు అప్పుగా ఇచ్చాడు. గత ఐదేళ్లుగా వీరి మధ్య ఈ డబ్బుల వ్యవహారం నడుస్తోంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని గడిచిన ఏడాదిన్నరగా స్వామి అడుగుతున్నా శ్రవణ్‌రెడ్డి పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వామి రెండు నెలల క్రితం డిండి ప్రాంతంలో ఆత్మహత్యకు యత్నించాడు. మళ్లీ శనివారం డబ్బులు అడిగేందుకు శ్రవణ్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన స్పందించలేదు. అక్కడే పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి చస్తే చావు అని అనడంతో స్వామి తీవ్ర మనస్తాపం చెందాడు. వెంటనే శ్రవణ్‌కుమార్‌రెడ్డి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. తన చావుకు పాల్వాయి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసరావే కారణమని చెబుతూ.. ఆ డబ్బును తనకివ్వకపోయినా కనీసం గ్రామంలో ఇవ్వాల్సిన వారికై నా ఇవ్వాలని కోరుతూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. దాన్ని గ్రామానికి చెందిన వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్ట్‌ చేశాడు. వీడియోను గమనించిన యువకులు వెంటనే కారులో స్వామిని చండూరుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌ ద్వారా నల్లగొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

ఫ సెల్ఫీ వీడియో తీసుకుంటూ

పురుగుల మందు తాగిన బాధితుడు

ఫ తన చావుకు మాజీ మంత్రి

కుమారుడే కారణమంటూ ఆరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement