రేపు బుద్ధవనంలో ధమ్మ దీపోత్సవం | - | Sakshi
Sakshi News home page

రేపు బుద్ధవనంలో ధమ్మ దీపోత్సవం

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సోమవారం ధమ్మ దీపోత్సవం నిర్వహించనున్నట్లు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య శని వారం తెలిపారు. బౌద్ధ సంప్రదాయంలో వాస్సావాసం ముగింపు సందర్భంగా నిర్వహించే ఈ వేడుకలకు హైదరాబాద్‌లోని ద ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ(ఇప్లూ) ప్రొఫెసర్‌ సంతోష్‌ రావత్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సోమవారం రాత్రి 7గంటలకు బుద్ధవనం ప్రధాన ద్వారం వద్దనున్న అశోక ధర్మచక్రం నుంచి దీపాలతో ర్యాలీ నిర్వహించి, బుద్ధచరిత వనంలోని బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించనున్నట్లు వివరించారు. అనంతరం మహాస్థూపం ధ్యాన మందిరంలో దీపాలతో పరిక్రమ నిర్వహించి బుద్ధజ్యోతులను వెలిగించి, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు తెలిపారు. బౌద్ధాభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మల్లెపల్లి లక్ష్మయ్య కోరారు.

ఎంజీయూలో ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభం

నల్లగొండ టూటౌన్‌: నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో శనివారం ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాన్ని వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, నాయకత్వ లక్షణాల పెంపునకు, సమాజం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని అలవర్చడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా విద్యార్థులను కేవలం విద్యావంతులుగానే కాకుండా, మంచి నడవడిక, క్రమశిక్షణ, సేవాభావం, మానవతా విలువలు కలిగిన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ మారం వెంకటరమణారెడ్డి, రిజిస్ట్రార్‌ అంజిరెడ్డి, విజయ్‌కుమార్‌, అంజనేయులు, షరీఫ్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement