సాగర్‌ను సందర్శించిన 14 దేశాల ప్రతినిధులు | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ను సందర్శించిన 14 దేశాల ప్రతినిధులు

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ను శనివారం 14 దేశాలకు చెందిన వ్యాపార ప్రతనిధుల బృందం సందర్శించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో స్టార్టప్‌ కంపెనీలకు సంబంధించి శిక్షణ పొందుతున్న వీరు అధ్యయన పర్యటనలో భాగంగా సాగర్‌కు చేరుకున్నారు. వీరిలో బంగ్లాదేశ్‌, ఈజిప్ట్‌, జింబాబ్వే, మాల్దీవులు, నైజీరియా, మారిషన్‌, ఇరాన్‌, సిరియా, టాంజనీయా తదితర 14 దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. సాగర్‌కు చేరుకున్న విదేశీ ప్రతనిధులకు రెవెన్యూ ప్రోటోకాల్‌ అధికారి దండ శ్రీనివాస్‌రెడ్డి స్వాగతం పలికారు. ప్రతినిధుల బృందం ప్రముఖ బుద్ధవనాన్ని సందర్శించింది. మమాస్థూపంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించి బౌద్ధచారిత్రక విశేషాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి సాగర్‌ ఆనకట్టను సందర్శించి ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలను తెలుసుకున్నారు. స్థానిక టూరిజం గైడ్‌ సత్యనారాయణ వారికి పర్యాటక విశేషాలను వివరించారు. పర్యటనలో స్టడీ టూర్‌ విజిట్‌ ఇన్‌చార్జి మహ్మద్‌ సయ్యద్‌ ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

బోరు డ్రిల్లింగ్‌ చేస్తూ డ్రైవర్‌ మృతి

నాంపల్లి : బోరు డ్రిల్లింగ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా రింగ్‌ తలకు తగలడంతో డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ఘటన నాగార్జునసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన చిలుకమర్రి ముత్తయ్య(32) గత ఐదేళ్లుగా ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఓబుల్‌రెడ్డి వద్ద బోరు బండి డ్రైవర్‌గా, డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం నాగార్జునసాగర్‌ పోలీస్‌ స్టేసన్‌ పరిధిలోని రేకులారం గ్రామంలో నరసింహానాయక్‌ అనే రైతు పొలంలో బోరు డ్రిల్లింగ్‌ చేస్తుండగా.. డ్రిల్లింగ్‌ రింగ్‌ అకస్మాత్తుగా ఊడి వచ్చి ముత్తయ్య తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తోటి కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బోరు బండి యజమాని ఓబుల్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement