కేదారీశ్వర వ్రతం ఎంతో విశిష్టమైనది | - | Sakshi
Sakshi News home page

కేదారీశ్వర వ్రతం ఎంతో విశిష్టమైనది

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

యాదగిరిగుట్ట: సనాతన ధర్మంలో సత్యనారాయణస్వామి, కేదారీశ్వర వ్రతాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. పార్వతీ పరమేశ్వరుల అర్థనారీశ్వర అవతారతత్వమే కేదారీశ్వర వ్రత ప్రాముఖ్యత. ఈ వ్రతం ఆచరిస్తే అందరికి బాగుటుంది. ఆశ్వయుజ అమవాస్య నుంచి కార్తీక బహుళ ద్వాదశి వరకు వ్రతాలు చేపడతారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్ట ఐశ్వర్యం, భోగ భాగ్యాలు కలుగుతాయని చరిత్ర చెబుతోంది. కేదారీశ్వర వ్రతం చేసేవారు ఉపవాసం ఉంటూ, శివుడిని తలచుకుంటూ, ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని ఓం నమశివాయ, కేదారీశ్వర నా మం జపించాలి. ప్రదో శకాలంలో ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ వ్రతం మహా భాగ్యం అనుకుంటూ 21 ముడులు వేయాలి. అప్పుడే వ్రత ఫలితం దక్కుతుంది. ప్రధానంగా మహా శివుడికి తీపి పదార్థాలు నైవేధ్యంగా సమర్పించి మంగళహారతులు ఇవ్వాలి.

– గౌరిభట్ల నర్సింహమూర్తి, పురోహితుడు, యాదగిరిగుట్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement