ప్రభుత్వం నిర్దేశించిన రేటుకు బియ్యం విక్రయం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం నిర్దేశించిన రేటుకు బియ్యం విక్రయం

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

మిర్యాలగూడ : ఎల్‌నినో నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంతోపాటు బియ్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన రేటుకు విక్రయించేందుకు మిర్యాలగూడలో ప్రత్యేక ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవనంలో ఆయన బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన ధరలకే ప్రజలకు బియ్యం అందించేందుకు మిర్యాలగూడ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ముందుకు రావడం అభినందనీయమన్నారు. బియ్యం ఔట్‌లెట్‌లను ఎల్‌నినో ప్రభావం ముగిసే వరకు కొనసాగించాలన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేదలు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి బియ్యం అందుబాటులో ఉండాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం బియ్యం ధరలను నిర్ధేశించిందన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు కిలో బియ్యం రూ.66కే విక్రయించేలా ఔట్‌లెట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ రాంపతినాయక్‌, డీఎస్‌ఓ వెంకటేశం, ఆర్డీవో రమణారెడ్డి, మిర్యాలగూడ రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్‌ చైర్‌పర్సన్‌ గుడిపాటి శిరీషనవీన్‌, రైస్‌ మిల్లర్స్‌ కార్యదర్శి బాబి తదితరులు ఉన్నారు.

అన్ని గ్రామాల్లో పనులు ప్రారంబించాం

నల్లగొండ : వీబీ జీ రాంజీ పథకం కింద జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభించామని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు నిర్వహించిన చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కలెక్టరేట్‌ నుంచి మాట్లాడారు. జిల్లాలో రోజూ 62,637 మంది కూలీలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 7200 కొత్త జాబ్‌ కార్డులు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement