చండూరు : మండలంలోని బంగారిగడ్డలో నీటిని వృథా చేసినందుకు గానూ గ్రామానికి చెందిన వేముల నర్సింహకు ఇన్చార్జి ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి కోటయ్య రూ.5 వేలు జరిమానా విధించారు. శుక్రవారం బంగారిగడ్డ బీసీ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ నీటిని వృథా చేయవద్దని ఎల్నినో ప్రభావం భూగర్భజలాలు తగ్గిపోయాయని, పరిస్థితులు అర్థం చేసుకోవాలని సిబ్బందితో కలిసి ప్రచారం చేశారు. నీరు వృథాగా పోయే నల్లాలకు డమ్మీలు బిగించారు. ఆ సమయంలో నర్సింహ ఇంట్లో నల్లా నీరు వృథాగా మొక్కలకు వదిలేయడాన్ని గమనించిన కార్యదర్శి.. అతనికి రూ.5 వేలు జరిమానా వేసి ఇంటికి నోటీసు అంటించారు.


