నల్లగొండ : ఇటీవల గుజరాత్‌లో జరిగిన సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్‌కు నల్లగొండ జిల్లా నుంచి వెళ్లిన 15 మంది సభ్యులు బుధవారం తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ శాలువా కప్పి సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేసి అబినందించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ మహమ్మద్ అక్బర్‌అలీ, తదితరులు పాల్గొన్నారు.
విదేశీయుల వసతి వివరాలు నమోదు చేయాలి : ఎస్పీ
నల్లగొండ : జిల్లాలో విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, పీజీలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హోమ్‌స్టేలు, ప్రైవేట్ ఇళ్ల యజమానులు తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు పాటించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సూచించారు. విదేశీ పౌరుల రాకపోకల వివరాలను ఫార్మ్–3 ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వసతి కల్పించేవారి చట్టబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేశారు. విదేశీ అతిథి వచ్చిన 24 గంటల్లోగా వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని, నమోదు చేసిన రికార్డులను ఏడాది పాటు భద్రపరచాలని సూచించారు. ఈ నిబంధనలు వర్తించే విదేశీ పౌరులతోపాటు ఓసీఐ కార్డుదారులు, నేపాల్, భూటాన్ పౌరుల విషయంలోనూ పాటించాల్సి ఉంటుందని తెలిపారు.
నేటి నుంచి మాక్ టెస్టులు
నల్లగొండ : ఉపాధ్యాయులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు మాక్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు డీఈఓ సుశీందర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని నల్లగొండ డైట్, దేవరకొండ బాయ్స్ హైస్కూల్, టీఎస్‌ఎంఎస్ తుంగపాడ్, కనగల్ టీఎస్‌ఎంఎస్, తిప్పర్తి టీఎస్‌ఎంఎస్, తిప్పర్తి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో మొత్తం 57 కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల ప్రధానోపాధ్యాయులు, ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
చేనేత సమస్యలను పరిష్కరించాలి
రామగిరి (నల్లగొండ) : జిల్లాలోని చేనేత సహకార రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘాల ప్రతినిధులు డీసీసీబీ జనరల్ బాడీ సమావేశంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి చెందిన పలు ఆర్థిక, పరిపాలనా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘాల అధ్యక్షులు అవ్వారి భాస్కర్, వనం సుదర్శన్, చెరుపెల్లి బాలరాజు, తడక నరసింహ, వనం శ్రీనివాస్, సుజాత, జెల్ల కోటేశ్వర్, గజం సత్యనారాయణ, చిలుకూరు శ్రీనివాస్, భారత లవకుమార్, పున్న ధర్మేందర్, సంగిశెట్టి సుదర్శన్, పూల వెంకటేశం, వల్లకాటి కుమారస్వామి, వనం కష్ణయ్య, వనం వాసుదేవులు, గంజి రమేష్ జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.


