నకిరేకల్ : ఎల్‌నినో నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై బుధవారం నకిరేకల్‌లో కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్దాయి సమావేశంలో గుత్తా మాట్లాడారు. నీటి లభ్యతను అంచనా వేసుకుని ఏ పంట సాగుచేస్తే ప్రయోజనకరంగా ఉంటుందో ఆలోచించి ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 27 లక్షల బోర్లు ఉండగా, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వాటి సంఖ్య 37 లక్షలకు చేరిందని.. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విప్, కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్‌నినో నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ప్రజలు తమ సమస్యలు, సందేహలను టోల్ ఫ్రీ నంబర్ (18004251442) ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా జలసిరపై రూపొందించిన సీడీని ఆవిష్కరించారు. సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఆర్‌డీఓ శైఖర్‌రెడ్డి, ఆర్డీఓ యానాల అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, మార్కెట్ చైర్‌పర్సన్ గుత్తా మంజులమాధవరెడ్డి, ఏడీఏ విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి


