నల్లగొండ : జిల్లాలో రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతనిర్వహణ తీరు బాగుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేష్ భట్టాచార్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన తాగునీరు, పారిశుద్ధ్యంపై సమీక్షించారు. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న వైద్యం, ఆరోగ్యం పారిశుద్ధ్య కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తుండడంనూ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. గిరిజన ప్రాంతాలతో పాటు, అన్ని గ్రామాలు, మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా కొనసాగించాలన్నారు. ఎల్‌నినో పరిస్థితి దృష్ట్యా నీటిని వృథా చేయకుండా చూడాలన్నారు. పాఠశాలల్లో తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, విద్య, వైద్య సదుపాయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, మిషన్ భగీరథ ఎస్‌ఈ నాగేశ్వరరావు రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, వైద్య, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు. ముందుగా ఆయనకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలెక్టర్ చంద్రశేఖర్ స్వాగతం పలికి పూల మొక్కను అందజేశారు. కార్యక్రమంలో
సమావేశంలో ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాహుల్, డీఈఓ సుశీందర్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి లావణ్య, అధికారులు పాల్గొన్నారు.
ఫ జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేష్ భట్టాచార్య
ఫ జిల్లా యంత్రాంగానికి అభినందన


