నైపుణ్యాభివృద్ధి శిక్షణను విస్తరించాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధి శిక్షణను విస్తరించాలి

Nov 4 2026 1:56 AM | Updated on Nov 4 2026 1:56 AM

నల్లగొండ : విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను విస్తరించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండలోని ఐటీ టవర్‌ను ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను, కంపెనీల పనితీరును పరిశీలించి మాట్లాడారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, నాగార్జున కళాశాల, ఇతర డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు పొందేలా ప్రోత్సహించాలన్నారు. తొలుత భవనంలోని పీఎం విశ్వకర్మ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ అందించారు? ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు? అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 500 మందికి శిక్షణ అందించినట్లు నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఐటీ టవర్‌ మేనేజర్‌ ఎన్‌.ప్రకాశ్‌తో మాట్లాడుతూ ఐటీ టవర్‌లో ఎన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి? వాటి నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు వెయ్యి కంపెనీలు ఉన్నట్లు మేనేజర్‌ వివరించారు. ఐటీ టవర్‌లోని సంస్థలు నిబంధనల ప్రకారం నిర్వహణ ఖర్చులు తప్పనిసరిగా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఐటీ టవర్‌ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ ఎన్‌.ప్రకాశం, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement