చలో ఢిల్లీకి సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

చలో ఢిల్లీకి సిద్ధం కావాలి

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

నల్లగొండ : జనగణనలో బీసీ కులగణన ఉండాలని కోరుతూ జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి బహుజన సమాజం సిద్ధం కావాలని ప్రజాపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్‌స్వామి పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండలోని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) భాగస్వామ్య రాజకీయ పక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. చాయ్‌ వాలా నని, బీసీనని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేశారని విమర్శించారు. జనగణనలో బీసీ కులగణన లేకపోవడమే మోదీ ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. సమావేశంలో నాయకులు పర్వతాలు, వస్కుల మట్టయ్య, బకరం శ్రీనివాస్‌, వైద్యుల సత్యనారాయణ, నేలపట్ల రమేష్‌, ధీరావత్‌ రవినాయక్‌, మేడి శంకర్‌, కొండూరు సత్యనారాయణ, గోవర్ధన్‌, పుట్టబత్తుల సత్యనారాయణ, మునాస రమణ, లోకనబోయిన రమణముదిరాజ్‌, వస్కుల సైదమ్మ, వరికల్‌ గోపాల్‌, కాశి, బర్రె సంజీవ, మారగొని వెంకన్నగౌడ్‌, దొండ నరసింహయాదవ్‌, జానిపోయిన కుమార్‌, రాచరికపు పెంటయ్య, పురం రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement