జాతీయ రహదారిపై వాహనాల రద్దీ | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

కేతేపల్లి: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవులు పూర్తి కావటంతో పాటు హైదరాబాద్‌ నుంచి శుభకార్యాలకు వెళ్లిన వారు ఆదివారం మధ్యాహ్నం తిరుగు పయనమయ్యారు. దీంతో సాయంత్రం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. ఈ క్రమంలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరాయి. టోల్‌ప్లాజాను దాటి వెళ్లేంత వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. వాహనదారులు టోల్‌ప్లాజా దాటేందుకు అరగంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. రద్దీ నేపథ్యంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోల్‌ప్లాజా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement