చిట్యాల : బ్రహ్మాణవెల్లెంల – ఉదయ సముద్రం ప్రాజెక్టు కాల్వ భూసేకరణ, నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఉదయ సముద్ర ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న కాల్వ అలైన్‌మెంట్‌ను శుక్రవారం ఆయన ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం గుత్తా తన నివాసంలో ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల వివరాలు, భూసేకరణ తీరును అధికారులు చైర్మన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాలువ నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టి సాగునీటిని అందించాలని సూచించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సీఈ భద్రూ, డీఈ విఠల్, ఏఈ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
ఫ ఉదయ సముద్ర ప్రాజెక్టు పనులపై సమీక్ష


