మిర్యాలగూడ : ప్రజలపై ఆర్థిక భారం పడకుండా రైస్ మిల్లర్లు బియ్యం ధరలు పెంచవద్దని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం మిర్యాలగూడ సమీపంలోని దాక్షాయిని పార్బాయిల్డ్ రైస్ మిల్లును ఆయన సందర్శించి మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున నిత్యావసర వస్తువల ధరల విషయంలో వ్యాపారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మిల్లర్ల నుంచి వ్యాపారుల వరకు సరైన సమన్వయం ఉంటే వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం అందించే అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్ఓ వెంకటేష్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతినాయక్, రైస్ మిల్ల ర్స్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణచౌదరి, జేవి.రమణ, తిరుపతిరావు ఉన్నారు.


