నాలుగు లేన్లుగా సాగర్‌ రోడ్డు | - | Sakshi
Sakshi News home page

నాలుగు లేన్లుగా సాగర్‌ రోడ్డు

Oct 30 2026 2:21 AM | Updated on Oct 30 2026 2:21 AM

నల్లగొండ : నల్లగొండ నగరంలో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మరో అడుగు పడింది. నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సాగర్‌ రోడ్డులో వైఎస్సార్‌ విగ్రహం నుంచి చర్లగౌరారం రోడ్డు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు శుక్రవారం పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు నగర మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి గురువారం తెలిపారు. నగరాన్ని స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మంత్రి ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు కేటాయించారని మేయర్‌ పేర్కొన్నారు. నాలుగు లేన్ల రహదారిలో డివైడర్‌తోపాటు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా మంత్రి ఇచ్చిన హామీ మేరకు రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి కార్పొరేటర్లంతా హాజరుకావాలని ఆమె కోరారు.

ఫ వైఎస్సార్‌ విగ్రహం నుంచి చర్లగౌరారం రోడ్డు వరకు విస్తరణ

ఫ ఎన్నికల హామీ మేరకు నిధులు మంజూరు చేసిన మంత్రి కోమటిరెడ్డి

ఫ డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌తో రహదారి అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement