సృజనాత్మకతకు సాహిత్య వేడుకలు దోహదం | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకతకు సాహిత్య వేడుకలు దోహదం

Oct 30 2026 2:21 AM | Updated on Oct 30 2026 2:21 AM

రామగిరి(నల్లగొండ) : యువతలో సాహిత్యాభిరుచి, సృజనాత్మకత, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడంలో సాహిత్య వేడుకలు ఎంతో దోహదపడతాయని ప్రముఖ రచయిత డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఈ నెల 31న నిర్వహించనున్న సమూహ యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ పోస్టర్‌ను గురువారం నల్లగొండ ఎన్జీ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. యువ రచయితలు తమలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి వేదికలు ఉపయోగించుకోవాలన్నారు. సమూహ నల్లగొండ జిల్లా కన్వీనర్‌ ప్రభాకర్‌ కస్తూరి మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరిగే ఈ వేడుకలో జిల్లాలోని సాహిత్యాభిమానులు, యువ రచయితలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్‌ పగడాల నాగేందర్‌, మోత్కూరు శ్రీనివాస్‌, తెలుగు శాఖ అధ్యాపకులు సందేనబోయిన ప్రభాకర్‌, డాక్టర్‌ టంగుటూరి సైదులు, దండి అంజయ్య, మామిడి లింగస్వామి, కట్ట శ్రవణ్‌ కుమార్‌, వనజ, బి.చిట్టెమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement