వ్యవసాయరంగ పరిరక్షణకు పోరాడుతామని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ అన్నారు.
- 8లో
విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు
పెద్దవూర: నందికొండ మున్సి పాలిటీ పరిధిలోని హిల్‌కాలనీ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని గురువారం డీసీహెచ్‌ఎస్ డాక్టర్ భానుప్రసాద్ నాయక్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను, ఓపీ రికార్డులు, వైద్య సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించి మాట్లాడారు. గతంలో ఇదే ఆసుపత్రిలో సేవలు అందించి డీసీహెచ్‌ఎస్‌గా పదోన్నతి పొందిన భానుప్రసాద్ నాయక్‌ను మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, వైద్య సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరికృష్ణ, ఆర్‌ఎంఓ డాక్టర్ జయంత్ అభినందన్, వాడపల్లి శ్రీధర్, పద్మజ, జ్యోతి పాల్గొన్నారు.


