అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

చండూరు : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాల్సిందేనని నల్లగొండ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన స్పష్టం చేశారు. చండూరు ఆర్‌డీఓ, మునుగోడు ఈఆర్‌ఓ కార్యాలయంలో కలెక్టర్‌ చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌తో కలిసి ఆమె జిల్లాలోని ఈఆర్‌ఓలు, రాజకీయ పార్టీల నాయకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవసేన మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంలో అధికారులతో పాటు రాజకీయ పార్టీల పాత్ర కూడా ఎంతో కీలకమన్నారు. ఇంకా ఎక్కడైనా అర్హులైన వారు ఉంటే.. రాజకీయ నాయకులు వారిని గుర్తించి ఓటరుగా నమోదయ్యేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల నాయకులను, ఈఆర్‌ఓ వద్ద జరిగే వారపు సమావేశాలకు హాజరవుతున్నారా? లేదా? అని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌కు సంబంధించిన రికార్డులన్నింటినీ జాగ్రత్తగా నిర్వహించాలని, యాప్‌లో అన్ని వివరాలు పక్కాగా నమోదయ్యేలా చూడాలన్నారు. కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి అన్ని హియరింగ్స్‌ను పూర్తి చేశామన్నారు. ఫారం 6, 7, 8లపై వచ్చిన అభ్యంతరాల పరిష్కారానికి నవంబర్‌ 5వ తేదీని తుది గడువుగా ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించిందని తెలి పారు. నవంబర్‌ 9న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, దేవరకొండ సబ్‌ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్‌ ధియాన్‌ మావి, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.

ఫ ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రక్రియలో తప్పులకు తావుండొద్దు..

ఫ ఓటరు జాబితా పరిశీలకురాలు శ్రీదేవసేన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement