నల్లగొండ : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ డీలర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, క్వింటాకు రూ.300 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల ద్వారా సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. గోదాముల నుంచి సరఫరా చేసే బియ్యాన్ని కచ్చితంగా కాంటా వేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దొడ్డు బియ్యం నిల్వపై తరుగు సడలింపు ఇవ్వాలని కోరారు.కార్యక్రమంలో డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు, కోటగిరి సూర్యనారాయణ, సముద్రాల యాదయ్య, బొల్లా వేణుగోపాలరావు, పగిళ్ల వెంకటేశ్వర్లు, కొర్ర శంకర్ నాయక్, సత్తిరెడ్డి పాల్గొన్నారు.


