పెద్దవూర : భావోద్వేగాలున్న ప్రతి వ్యక్తి కవి అవుతాడని, భావోద్వేగంలో పుట్టిన వాక్యమే కవిత్వం అవుతుందని ప్రముఖ కవి విమర్శకులు ఆర్.సీతారాం అన్నారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని బుద్ధవనంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి యూత్ లిటరరీ ఫెస్ట్–2026 రెండవ రోజు ఆదివారం ఆయన మాట్లాడారు. ఒకే కవిత్వం పాఠకులను అనుసరించి పలు విధాలుగా గోచరిస్తుందని పేర్కొన్నారు. కవి విమర్శకులు బీవీ.స్వామి మాట్లాడుతూ కథలు రాయడమంటే సమాచారం ఇవ్వడం కాదని సృజనాత్మకంగా చెప్పే నేర్పును రచయితలు సాధించాలని సూచించారు. రెండు రోజుల యూత్ లిటరరీ ఫెస్ట్‌లో 150 మంది యువ కవులు, రచయితలు హాజరై చర్చల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంతోజు మోహన్‌కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటుకోజ్వల అనందాచారి, డాక్టర్ నర్రా ప్రవీణ్‌రెడ్డి, తగుళ్ల గోపాల్, కృష్ణ కౌండిన్య, కుకుడాల గోవర్ధన్, ఎండీ.హుసేన, దాసరి శ్రీరాములు, బూరుగు గోపికృష్ణ, సలీమ, శరత్‌సుదర్శి, మేరెడ్డి రేఖ, హరిప్రియ, నరిసింహ తదితరులు పాల్గొన్నారు.


